Wednesday, January 22, 2025

ఎడ్-ఎ-మమ్మాలో రిలయన్స్‌కు 51% వాటా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: దేశీయ కిడ్స్ క్లాతింగ్ బ్రాం డ్ ఎడ్‌ఎమమ్మాలో 51 శాతం వాటాను కొనుగోలు చేయనున్నామని రిటైలర్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రకటించింది. స్టాక్‌మార్కెట్లో లిస్టింగ్‌కు ముందు రిలయన్స్ రిటైల్ దూకుడుగా విస్తరణ కార్యక్రమాలు చేపడుతోంది. బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ గత నెలలో కంపెనీ విలువను 100 బిలియన్ డాలర్లుగా నిర్ణయించగా, ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించింది.

సెప్టెంబర్ ముగింపు నాటికి 2.5 బిలియన్ డాలర్లు సమీకరించడమే లక్షంగా కంపెనీ గ్లోబల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. గ్రాసరీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని రకాల ఉత్పత్తులను విక్రయించే రిలయన్స్ రిటైల్ దాదాపు 18 వేల అవుట్‌లెట్లను కల్గివుంది. ఇప్పటికే ఫ్యాషన్ లేబుల్స్ రీతు కుమార్, మనీష్ మ ల్హోత్రా వంటి దేశీయ బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకోగా, అలాగే ఆర్మని, మార్క్ అండ్ స్పెన్సర్ వంటి విదేశీ బ్రాండ్లతో కూ డా ఒప్పందాలు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News