Sunday, December 22, 2024

రిలయన్స్ అదుర్స్.. క్యూ4లో లాభం రూ.19,299 కోట్లు

- Advertisement -
- Advertisement -

ముంబై : ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4(జనవరిమార్చి) ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. కంపెనీ నికర లాభం రూ.19,299 కోట్లతో 19 శాతం వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.16,203 కోట్లుగా ఉంది. ఈసారి రిలయన్స్ విశ్లేషకుల అంచనాలను మించి రాణించింది. కంపెనీ ఆదాయం రూ.2.11 లక్షల కోట్ల నుంచి రూ.2.16 లక్షల కోట్లకు పెరిగింది. మార్కెట్లో రిలయన్స్ షేరు స్వల్పంగా పెరిగి రూ.2,348కి చేరింది.

మూడు రోజుల లాభాలకు బ్రేక్

మూడు రోజుల వరుస లాభాలను శుక్రవారం బ్రేక్ పడింది. వారంలోని చివరి ట్రేడింగ్ రోజు స్టాక్‌మార్కెట్ నిరాశపరిచింది. సెన్సెక్స్ స్వల్ప పెరుగుదలతో నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో షేర్ల పతనం కారణంగా మార్కెట్‌లో క్షీణత కనిపించింది. సెన్సెక్స్ 22.71 పాయింట్ల లాభంతో 59,655 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 0.40 పాయింట్ల స్వల్ప క్షీణతతో ముగిసింది. ఎఫ్‌ఎంసిజి, ఐటి, ఫార్మా, మీడియా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు స్వల్గంగా పెరిగాయి. బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం రూ.265.40 లక్షల కోట్లు ఉండగ, శుక్రవారం ఇది రూ.264.97 లక్షల కోట్లకు తగ్గింది. అంటే ఇన్వెస్టర్ల సంపదలో రూ.43 వేల కోట్ల క్షీణత నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News