Friday, December 20, 2024

ఆభార్ కలెక్షన్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆభరణాల పరిశ్రమలో నమ్మకానికి మారు పేరుగా నిలచిన రిలయన్స్ జువెల్స్ సంస్థ 16వ వార్షికోత్సవానికి గుర్తుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆభార్ కలెక్షన్ 2023ను ప్రవేశపెట్టింది. ఇంతకాలంగా సంస్థను ఆదరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతా సూచకంగా ఈ కలెక్షన్‌ను ప్రవేశపెట్టింది. బంగారు, వజ్రాల చెవిదుద్దుల ప్రత్యేక డిజైన్లు వినియోగదారులతో రిలయన్స్ జువెల్స్‌కున్న సుదీర్ఘ అనుబంధాన్నిగుర్తు చేస్తాయి.

ఆభార్ కలెక్షన్ 2023 ఆఫర్ ఈ నెల 31 వరకు ఉంటుందని రిలయన్స్ జువెల్స్ సిఇఓ సునీల్ నాయక్ తెలియజేశారు.ఈ సమయంలో బంగారు అభరణాల మజూరీ చార్జీలు, వజ్రాల ఆభరణాల విలువపై 25 శాతం వరకు తగ్గింపును అందిస్తుందని ఆయన చెప్పారు. ఈ కలెక్షన్ దేశవ్యాప్తంగా ఉన్న తమ షోరూమ్‌స, షాప్ ఇన్ షాప్స్‌లో అందుబాటులో ఉంటుందన్నారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News