బెంగళూరు: రిలయన్స్ త్వరలో తక్కువ ధరలో లభించనున్న ‘జియోబుక్’ ల్యాప్ టాప్ మార్కెట్‌లోకి తేనున్నది. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ జియోబుక్‌ను తెస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మోడల్స్‌లో తేనున్నారని వినికిడి.
స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే… జియోబుక్ 1,366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్‌టీఈ మోడెమ్ డిస్ప్లేని కలిగి ఉంది. ల్యాప్‌టాప్ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. ఇది 11 నానో మీటర్ టెక్నాలజీతో పని చేస్తుంది. ఒక మోడల్‌లో 2జీబీ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ తో పాటు 32జీబీ ఇఎంఎంసి స్టోరేజ్ ఉంది.
మరో మోడల్‌లో 4జీబీ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 64జీబీ ఇఎంఎంసి 5.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5గిగా హెడ్జ్ వైఫై సపోర్ట్, బ్లూటూత్, 3 యాక్సిస్ యాక్సెలెరోమీటర్, క్వాల్‌కోమ్ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. జియో ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.