Wednesday, January 22, 2025

త్వరలో జియో ఫైనాన్షియల్ లిస్టింగ్

- Advertisement -
- Advertisement -

ముంబయి: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లను లిస్ట్ చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఫైనాన్సియల్ షేర్లను లిస్ట్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రిలయన్స్‌లో భాగంగా ఉన్న దీన్ని వేరుచేసి మార్కెట్లో లిస్ట్ చేయాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నారు. రిలయన్స్ షేర్లు ఉన్న ప్రతి షేరుహోల్డరుకి రిలయన్స్ షేరుకి ఒక జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేరు కేటాయించనున్నారు. మార్కెట్లో లిస్ట్ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ గతంలోనే ప్రకటించింది.

అయితే నిర్ణీత గడువును వెల్లడించలేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం అక్టోబర్‌లోగా దీన్ని లిస్ట్ చేయనున్నారు. జియో లిస్టింగ్ తర్వాత రుణాలు, ఇన్సూరెన్స్, మ్యూచ్‌వల్ ఫండ్స్ తదితర సేవల ద్వారా మార్కెట్లోకి దూసుకువెళ్లాలని వ్యూహంతో ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. టెలికంలో జియో విప్లవం సృష్టించింది. ఈ తరహాలోనే జియో ఫైనాన్సియల్ ద్వారా ఆర్థిక సేవల మార్కెట్లోకి చొచ్చుకుపోవాలని రిలయన్స్ అధినేత యోచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News