Monday, December 23, 2024

రూ.999కే ‘జియో భారత్’ ఫోన్..

- Advertisement -
- Advertisement -

 జులై 7 నుంచి విక్రయాలను ప్రారంభించనున్న రిలయన్స్ జియో
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో 4జి ఫోన్ ’జియో భారత్ వి2’ని విడుదల చేసింది. దీని ధర రూ. 999గా కంపెనీ నిర్ణయించింది. జులై 7 నుంచి ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో 4జి, అపరిమిత కాల్స్, యుపిఐ పేమెంట్ సేవలు వంటివి ఉన్నాయి. ‘జియో భారత్ వి2’ ద్వారా కంపెనీ 10 కోట్లకు పైగా కస్టమర్లను చేర్చుకోనున్నట్టు కంపెనీ పేర్కొంది.

కొత్త ఫోన్ కోసం వినియోగదారులు 28 రోజుల ప్లాన్‌కు రూ.123 చెల్లించాలి. వాయిస్ కాల్‌లు, ఇతర ఆపరేటర్ల 2జిబి నెలవారీ ప్లాన్‌లు రూ.179 నుండి ప్రారంభమవుతాయి. ఇది కాకుండా వినియోగదారులకు 14జిబి డేటాను ఇస్తోంది. అంటే రోజుకు సగం 0.5 జిబి పొందుతారు. వార్షిక ప్లాన్ కూడా ఉంది. దీని కోసం రూ.1,234 చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News