Monday, December 23, 2024

రిలయన్స్ లాభం రూ.16,011 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202324) మొదటి త్రైమాసిక ఫలితాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐఎల్) నిరాశపర్చింది. క్యూ1(ఏప్రిల్‌జూన్)లో కంపెనీ నికర లాభం రూ.16,011 కోట్లతో 10.8 శాతం క్షీణించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.17,955 కోట్లుగా ఉంది. ఏప్రిల్‌జూన్‌లో ఆపరేషన్స్ నుండి స్థూల ఆదాయం 4.6 శాతం పడిపోయింది. గతేడాదిలో ఈ ఆదాయం రూ.2,42,529 కోట్లుగా ఉండగా, ఇప్పుడు ఇది రూ.2,31,132 కోట్లకు పడిపోయింది. అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరల్లో క్షీణత వల్ల ఆయిల్ నుంచి కెమికల్స్ (ఒ2సి) వ్యాపారం వృద్ధి బలహీనపడగా, దీంతో ఆదాయం, నికర లాభాలు తగ్గాయి. డైవర్సిఫైడ్ కంపెనీ ఒ2సి ఆదాయం క్యూ1లో రూ.1,33,031 కోట్లతో 17.1 శాతం తగ్గింది. గతేడాదిలో ఇది రూ.1,61,715 కోట్లుగా ఉంది.

ఎబిటా రూ.37,997 కోట్ల నుంచి రూ.38,093 కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, రిలయన్స్ పటిష్టమైన ఆపరేటింగ్, ఫైనాన్షియల్ పనితీరు తమ వ్యాపారాల డైవెర్సిఫైడ్ పొర్ట్‌ఫోలియోను నిలకడగా ఉంచాయని, ఇది పరిశ్రమ, కన్జూమర్ రంగం వ్యాప్తంగా డిమాండ్‌ను పెంచిందని అన్నారు. 202223 ఆర్థిక సంవత్సరానికి షేరుకు రూ.9 చొప్పున డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది. గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జెఎఫ్‌ఎస్‌ఎల్) విభజన జరిగింది. జెఎఫ్‌ఎస్‌ఎల్ షేర్ ధరను ప్రైస్ డిస్కవరీ మెకానిజం కింద రూ.261.85గా నిర్ణయించారు. అయితే బ్రోకరేజ్ అంచనా రూ.190కి కంటే అధికంగా ట్రేడ్ అయింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ధరను నిర్ణయించడానికి ఆర్‌ఐఎల్ షేర్ల కోసం ఒక గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ జరిగింది.

రిలయన్స్ స్టాక్‌పై అత్యధిక ఆర్డర్ వచ్చిన రేటు ప్రకారం జియో ఫైనాన్షియల్ రేటు నిర్ణయించారు. జెఎఫ్‌ఎస్‌ఎల్ రూ.261.85 వద్ద ట్రేడ్ అయింది. అంతేకాదు ఈ స్టాక్ మార్కెట్ విలువ పరంగా రూ.1.72 లక్షల కోట్లతో దేశంలో 32వ అతిపెద్ద సంస్థగా అవతరించింది. ఆర్‌ఐఎల్ 100 షేర్లను కలిగి ఉంటే, జెఎఫ్‌ఎస్‌ఎల్ 100 షేర్లను పొందుతుంది. జూలై 19న ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్‌ఐఎల్ షేర్లను కలిగి ఉన్న వాటాదారులకు జెఎఫ్‌ఎస్‌ఎల్ అంటే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు 1:1 నిష్పత్తిలో లభిస్తాయి. ఉదాహరణకు ఆర్‌ఐఎల్ 100 షేర్లను కలిగి ఉంటే, జెఎఫ్‌ఎస్‌ఎల్ 100 షేర్లు లభిస్తాయి. కానీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్ తేదీ వరకు జెఎఫ్‌ఎస్‌ఎల్ షేర్లలో ట్రేడింగ్ చేయలేరు.

జియో లాభం 12 శాతం వృద్ధి
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికామ్ సంస్థ జియో ఇన్ఫోకామ్ నికర లాభం రూ.4,863 కోట్లతో 12 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.4,335 కోట్లు నమోదు చేసింది. జియో మొత్తం ఆదాయం రూ.21,995 కోట్ల నుంచి రూ.24,127 కోట్లకు పెరిగింది. మార్కెట్ వాటాను పెంచుకునేందుకు నెట్‌వర్కింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో జియో అత్యధికంగా పెట్టుబడులు పెడుతోంది. గత నెలలో తక్కు ధరకే 4జి ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News