Wednesday, January 22, 2025

ఫోర్బ్స్ గ్లోబల్ టాప్ 2000 కంపెనీల జాబితాలో రిలయన్స్‌కు 45వ ర్యాంకు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టాప్ 2000 పబ్లిక్ కంపెనీల తాజా జాబితాను ఫోర్బ్స్ మంగళవారం విడుదల చేసింది. గత ఏడాదితో పోలిస్తే ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 8 స్థానాలు ఎదిగి 45వ ర్యాంకులో నిలిచింది. భారత్‌కు చెందిన మరే కంపెనీ ఇంత ఉన్నత ర్యాంకును సాధించలేదు. అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ విలువ వంటి నాలుగు ప్రమాణాల ఆధారంగా ఫోర్బ్ ప్రపంచంలోని అత్యున్నత కంపెనీల గ్లోబల్ 2000 ర్యాంకులను నిర్ణయిస్తుంది. 2023 సంవత్సరానికి చెందిన ప్రపంచంలోని టాప్ 2,000 కంపెనీల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది.

అమెరికాలోని అతి పెద్ద బ్యాంకు జెపి మోర్గన్ 3.7 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో నంబర్ ఒన్ స్థానంలో నిలిచింది. 2011 తర్వాత ఈ బ్యాంకు అగ్రస్థానంలో నిలవడం ఇదే మొదటిసారి. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన వారెన్ బఫెకు చెందిన బెర్క్‌షైర్ హాథవే ఈ తాజా జాబితాలో 338వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడులలో వచ్చిన భారీ నష్టాలే ఈ పతనానికి కారణంగా తెలుస్తోంది.

సౌదీకి చెందిన ఆయిల్ కంపెనీ బెహెమోత్ అరంకో 2వ స్థానంలో నిలిచింది. తరువాతి స్థానలలో చైనాకు చెందిన ప్రభుత్వ బ్యాంకులు నిలిచాయి. టెక్నాలజీ దిగ్గజాలు ఆల్ఫాబెట్, యాపిల్ వరుసగా 7, 10వ ర్యాంకులను సాధించాయి.

చమురు నుంచి టెక్నాలజీ వరకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం అమ్మకాలు 100.43 బిలియన్ డాలర్లు ఉండగా లాభాలు 8.3 బిలియన్ డాలర్లు ఉన్నాయి. గత ఏడాది 53వ ర్యాంకును సాధించిన రిలయన్స్ ఈ ఏడాది 45వ ర్యాంకుకు చేరుకుంది. ఫోర్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ కంపెనీలలో ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జిసి 226వ ర్యాంకును, హెచడిఎఫ్‌సి 232 ర్యాంకును, ఎల్‌ఐసి 263 ర్యాంకు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 387వ ర్యాంకులో నిలిచాయి. ఈ జాబితాలోని మరికొన్ని భారతీయ కంపెనీలలో యాక్సిస్ బ్యాంకు(423), ఎన్‌టిపిసి(433), ఎల్ అండ్ టి(449), భారతీ ఎయిర్‌టెల్(478), కొటక్ మహీంద్ర బ్యాంకు(502), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(540), ఇన్ఫోసిస్(554), బ్యాంక్ ఆఫ్ బరోడా(586), కోల్ ఇండియా(591), టాటా స్టీల్(592), హిండాల్కో(560), వేదాంత(687) ఉన్నాయి.మొత్తం 55 భారతీయ సంస్థలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

తౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపునకు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1062 ర్యాంకు, అదానీ పవర్ 1488 ర్యాంకు, అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ 1598 ర్యాంకులో నలిచిచాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News