Monday, December 23, 2024

రిలయన్స్ చేతికి ఫ్యూచర్ స్టోర్స్!

- Advertisement -
- Advertisement -
Reliance takes control of Future Retail stores
ఉద్యోగులనూ చేర్చుకుంటున్న సంస్థ

న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌రిలయన్స్ రిటైల్ మధ్య కుదిరిన డీల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఫ్యూచర్ రిటైల్ కార్యకలాపాలను చేపట్టేప్రక్రియను రిలయన్స్ ప్రారంభించింది. ఉద్యోగులను తమ గ్రూపులోకి తీసుకుంటోంది.ఫ్యూచర్ గ్రూపు తన రిటైల్‌వ్యాపారాన్ని రిలయన్స్‌కు విక్రయించడం సహా అమెజాన్ గ్రూపు, ఫ్యూచర్ గ్రూపు మధ్య కుదిరిన ఒప్పందం చెల్లుబాటు విషయంలో ఈ రెండు సంస్థలు న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు, ఎన్‌సిఎల్‌టి, ఢిల్లీ హైకోర్టుల పరిధిలో ఉంది.ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. బిగ్‌బజార్ తదితర పేర్లతో ఫ్యూచర్ గ్రూపు వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఆ స్టోర్లలో కొన్నిటిని రిలయన్స్ రిటైల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్యూచర్ గ్రూపు పేరును తీసేసి తనబ్రాండ్ స్టోర్లుగా మారుస్తోంది. దీంతో పాటుగా ఫ్యూచర్ రిటైల్ స్టోర్స్ ఉద్యోగులకు రిలయన్స్ పే రోల్స్ వర్తింపజేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

అయితే దీనిపై ఇటు ఫ్యూచర్ గ్రూపు, రిలయన్స్ కానీ, అటు అమెజాన్ కానీ అధికారికంగా తమ స్పందనను తెలియజేయలేదు. 2020 ఆగస్టులో అప్పుల్లో కూరుకు పోయిన ఫ్యూచర్ గ్రూపు తన రిటైల్ వ్యాపారాన్ని రిలయర్స్ రిటైల్‌కు విక్రయించింది. ఈ డీల్ విలువ రూ.24,713 కోట్లు. అయితే దీనిపై అమెజాన్ అభ్యంతరం చెబుతోంది. తమ కంపెనీతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఫ్యూచర్ గ్రూపు ఉల్లంఘించిందంటూ ఈ డీల్ చెల్లుబాటును సవాలు చేస్తూ సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. మరో వైపు అమెజాన్‌ఫ్యూచర్ గ్రూపు మధ్య కుదిరిన డీల్‌ను రద్దు చేస్తున్నట్లు గత ఏడాది డిసెంబర్‌లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీంతో ఇరు వర్గాలు ఆయా అంశాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడంతో న్యాయపోరాటం కొనసాగుతోంది. కాగా ఫ్యూచర్ గ్రూపునకు దేశవ్యాప్తంగా 1700 దాకా ఔట్‌లెట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 200 ఔట్‌లెట్లను రిలయన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News