Wednesday, January 22, 2025

రిలయన్స్ లాభం రూ.17,806 కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసిక ఫలితాల్లో నిరాశపర్చింది. డిసెంబర్ ముగింపు నాటి క్యూ3(అక్టోబర్ డిసెంబర్) ఫలితాల్లో కంపెనీ నికర లాభం రూ.17,806 కోట్లు నమోదు చేసింది. అయితే గతేడాదిలో వచ్చిన రూ.20,539 కోట్లతో పోలిస్తే లాభం 13.3 శాతం క్షీణించింది. అయితే త్రైమాసిక ప్రతిపాదికన చూస్తే లాభం రూ.15,512 కోట్లతో(క్యూ2) పోలిస్తే 14.78 శాతం పెరిగింది. ఇక కంపెనీ ఆపరేషన్స్ నుంచి ఆదాయం రూ.1,91,271 కోట్ల నుంచి రూ.2,20,592 కోట్లకు పెరిగింది.

అంటే ఆదాయంలో 15.32 శాతం వృద్ధి నమోదైంది. త్రైమాసిక ప్రతిపాదికన ఆదాయం క్యూ2లో రూ.2,36,377 కోట్లతో పోలిస్తే 5.26 శాతం తగ్గింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, అన్ని విభాగాల వ్యాపారాల్లో కంపెనీ టీమ్‌లు చాలా బాగా పనిచేశాయని, ప్రతికూల పరిస్థితుల్లోనూ మెరుగైన ఫలితాలను ప్రదర్శించారని ప్రశంసించారు. ఆర్‌ఐఎల్ స్థూల ఆదాయం వార్షికంగా రూ.2,09,823 కోట్ల నుంచి రూ.2,40,963 కోట్లకు అంటే 15 శాతం పెరిగింది.

28% పెరిగిన జియో లాభం

క్యూ3 ఫలితాల్లో రిలయన్స్ జియో నికర లాభం 28 శాతం పెరిగింది. సంస్థ నికర లాభం రూ.4,881 కోట్లు నమోదైంది. జియో కమర్షియల్ 5జి సేవలను అక్టోబర్ ఆఖరులో ప్రారంభించింది. 53 లక్షల కొత్త యూజర్లు చేరారు.

రిలయన్స్ రిటైల్ లాభం 6% జంప్

డిసెంబర్ ముగింపు నాటి క్యూ3(అక్టోబర్ డిసెంబర్) ఫలితాలో రిలయన్స్ రిటైల్ నికర లాభం రూ.2400 కోట్లతో 6.2 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం రూ.60,096 కోట్లతో 18.6 శాతం పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News