Sunday, January 19, 2025

కేజ్రీవాల్ కు ఊరట..

- Advertisement -
- Advertisement -

జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. హిందూ సేన అధ్యక్షుడు విష్ణుగుప్తా దాఖలు చేసిన పిల్‌ను జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన బెంచ్ కొట్టేసింది. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని బెంచ్ తెలిపింది . దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బెంచ్ తెలిపింది.

“ ప్రభుత్వం పనిచేయట్లేదని మేం ఎలా తేలిస్తాం. ఎల్‌జీ ఇందుకు సరైన వ్యక్తి. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. ఆయనకు సలహాలు ఇచ్చే అవకాశం మాకు లేదు. చట్ట ప్రకారం ఏం చేయాలో ఆయన ఆలోచిస్తారు.” అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పిటిషనర్‌కు రాష్ట్రపతి, ఎల్‌జీ వద్ద పరిష్కారం దొరుకుతుందని సూచించారు. కేజ్రీవాల్‌ను పదవి నుంచి తప్పించాలని కోరుతూ పిల్ దాఖలు కావడం ఇది రెండోసారి. సూరజ్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి గత నెల 28న దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News