Friday, April 25, 2025

సిఎం రేవంత్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో కేసు విచారణకు వ్యక్తిగత హాజరు హాజరు నుంచి రేవంత్‌రెడ్డికి న్యాయస్థానం మినహాయింపు నిచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ఎక్సైజ్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి అధికారిక కార్యక్రమాల వల్ల కోర్టుకు హాజరు కావడం సాధ్యం కాదని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, రేవంత్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి కొంత ఊరట లభించినట్ల యింది. అయితే, ఈ కేసులో న్యాయస్థానం తదుపరి విచారణను కొనసాగించనుంది.

ఈ వివాదం 2024 మే 5న కొత్తగూడెంలో జరిగిన ‘జన జాతర’ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్రంగా స్పందించారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై ఫిర్యా దు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లుగా నకిలీ వీడియోను సృష్టించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. దీంతో రేవంత్‌రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News