Saturday, November 16, 2024

హైకోర్టులో కాంగ్రెస్ నేత పొంగులేటికి ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సొంత భూములపై ప్రభుత్వ సర్వేను సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రస్తుతం ధర్మాసనం స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. విచారణ ఆగస్టు 1కి కోర్టు వాయిదా వేసింది. ఎస్సార్ గార్డెన్‌లో 20 గుంటల ప్రభుత్వ భూమి ఉందని అధికారులు సర్వే చేశారు. ఎన్‌ఎస్‌పి ల్యాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే 13 సంవత్సరాల క్రితం గార్డెన్ నిర్మించామని పొంగులేటి పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగానే భూములు సర్వే చేస్తున్నారని పొంగులేటి పిటిషన్‌లో పొందుపరిచారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News