బిఆర్ఎస్ ముఖ్య నేత, సిద్దిపేట ఎంఎల్ఎ హరీష్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ వరకు హరీష్‌రావును అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట పోలీసుస్టేషన్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని హైకోర్టులో హరీష్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వచ్చేనెల 5న వాదనలు వినిపిస్తామన్న పిపి పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ నేత జి.చక్రధర్‌గౌడ్ హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. హరీష్ రావు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన ఫోన్‌తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఇంటెలిజెన్స్ విభాగం సహకారంతో ట్యాప్ చేశారని, దీని వెనుక బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఎ1గా హరీష్ రావు, ఎ2గా టాస్క్ ఫోర్స్ మాజి డిసిపి రాధాకిషన్ రావును పేర్కొన్నారు. దీంతో రాజకీయ కక్షతో తనపై ఇచ్చిన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేస్తే తన రాజకీయ జీవితంతోపాటు ప్రతిష్ట దెబ్బతింటాయన్నారు.