- Advertisement -
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.న బెయిలు షరతులను అత్యున్నత న్యాయస్థానం బుధవారం నాడు సడలించింది. బెయిలు షరతుల ప్రకారం వారంలో రెండు సార్లు విచారణ కార్యాలయంలో ఆయన రిపోర్టు చేయాల్సి ఉండగా, ఇక నుంచి ఆ అవసరం లేదని న్యాయమూర్తులు బీఆర్‌గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం సడలింపు ఇచ్చింది. “ వారానికి రెండు సార్లు రిపోర్ట్ చేయాలనే బెయిలు షరతును తొలగిస్తున్నాం. అయితే అప్లికెంట్ (సిసోడియా ) రెగ్యులర్‌గా విచారణకు హాజరు కావాలి” అని కోర్టు స్పష్టం చేసింది. మనీలాండరింగ్ కేసులో సిసోడియాకు గత ఆగస్టు 9న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
- Advertisement -