- Advertisement -
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ మాజీ నాయకురాలు నూపుర్‌శర్మపై దేశ వ్యాప్తంగా నమోదైన 10 కేసులపై విచారణను ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు బుధవారం ఆదేశాలిచ్చింది. దీంతో ఆమెకు గొప్ప ఉపశమనం లభించింది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ఆమెపై ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. తనపై నమోదైన అన్ని కేసులను ఒకే చోట విచారించే విధంగా ఆదేశాలివ్వాలని నూపుర్‌శర్మ సుప్రీం కోర్టును కోరారు.
- Advertisement -