Monday, January 6, 2025

రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు ఊరట!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్ లపై అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. వర్మ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టిన ఏపి హైకోర్టు అతడిని ఈ నెల 9 వరకు అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని రామ్ గోపాల్ వర్మ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్జీవిపై మూడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. ఒంగోలు, ప్రకాశం పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతానికి రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News