Wednesday, January 22, 2025

విద్వేష ప్రసంగం కేసులో ఎస్‌పి నేత ఆజం ఖాన్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

రాంపూర్: విద్వేషపూరిత ప్రసంగం కేసులో సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌ను నిర్దోషిగా ఇక్కడి ఎంపి ఎమ్మెల్యే సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019లో యుపిర విదుంవఫనేకిత నంకపంగం పపెలొ దిగెవ దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను సెషన్స్ కోర్టు బుధవారం కొట్టివేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ సదర్ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజ్‌వాది పార్టీ నేత ఆజం ఖాన్‌కు 2022 అక్టోబర్ 27న ఎంపి ఎమ్మెల్యే మెజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల కారాగార శిక్షను విధించింది.

దీంతో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి అనర్హుడయ్యారు. కాగా. ఆజం ఖాన్‌కు విధించిన శిక్షపై అప్పీలును ఆమోదించిన ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. ఆజం ఖాన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు వెలువరించిందని ఆజం ఖాన్ తరఫు న్యాయవాది వినోద్ శర్మ తెలిపారు. ఆజం ఖాన్ శాసనసభ్యత్వం రద్దు అయిన తర్వాత రాంపూర్ సదర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. బిజెపి అభ్యర్థి ఆకాశ్ సక్సేనా తన సమీప ప్రత్యర్థి, ఎస్‌పి అభ్యర్థి ఆసిమ్ రాజాను ఈ ఉప ఎన్నికలో ఓడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News