Monday, December 23, 2024

కెటిఆర్ స్పూర్తితో వరద ప్రభావిత గ్రామాల్లో సహాయక కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

వరద బాధితుల కోసం రూ.16 లక్షల చెక్కును ములుగు కలెక్టర్‌కు
అందించిన రెడ్కో ఛైర్మన్ సతీష్ రెడ్డి

హైదరాబాద్ : ఆపదలో ఉన్నవారిని కెటిఆర్ ఆదుకుంటున్న విధానాన్ని స్పూర్తిగా తీసుకుని.. ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన వారికి రెడ్కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆదుకుంటున్నారు. కెటిఆర్ సేవాగుణాన్ని స్పూర్తిగా తీసుకుని ములుగు ములుగు జిల్లాలోని వరద బాధితుల కోసం తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ(టిఎస్‌రెడ్కో), తెలంగాణ సోలార్ అసోసియేషన్ తరుపున 5 లక్షల రూపాయలు చెక్కును,వరద బాధితులను ఆదుకోవాలని సతీష్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు హెడ్ డిజిటల్ వర్క్ తరుపున రూ.10 లక్షలు, బిఆర్‌ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా ప్రెసిడెంట్ గుర్రాల నాగరాజు రూ 1 లక్షను పంపించారు. మొత్తం రూ. 16 లక్షల విలువైన చెక్కులను కలెక్టర్ ఇలా త్రిపాఠికి రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి అందజేశారు.

ఈ 16 లక్షల రూపాయలను వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయి, సర్వస్వం కోల్పోయిన నాన్ ట్రైబల్స్ కి ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున అందజేయనున్నట్టు సతీష్ రెడ్డి తెలిపారు. ట్రైబల్స్ కు ఇప్పటికే ఐటీడీఏ తరుపున తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.25 వేలు అందజేసినట్లు తెలిపారు.వరదసహాయక చర్యలపై ఆరా తీశారు. వరద బాధిత గ్రామాల్లో ఇళ్లు కోల్పోయిన వారి, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారి వివరాల సేకరణ, వారికి ప్రభుత్వం నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి ఎలాంటి సహాయం అందించాలనే అంశాలపై మాట్లాడారు. వరదబాధితులకు ఆర్థికసాయ చేసిన రెడ్కో సంస్థ, సోలార్ ఎనర్జీ అసోసియేషన్, హెడ్ డిజిటల్ వర్క్ , గుర్రాల నాగరాజులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ,సతీష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మరింత మంది దాతలు ముందుకొచ్చి వరదబాధితులను ఆదుకోవాలని కోరారు.మారుమూల పల్లెల్లో నిత్యావసరాలు, వంట సామగ్రి, దుస్తుల వంటివి అందించి చాలా గ్రామాల ప్రజలకు అండగా నిలవడం స్పూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News