- Advertisement -
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా, మధ్యాహ్నం లోకేశ్ పై కౌశల్ కేసును హైకోర్టు ముగించింది. దీంతో లోకేష్‌కు పెద్ద ఊరట లభించింది. కౌశల్ కేసులో లోకేష్ ను నిందితుడిగా చేర్చలేదని సిఐడి తెలిపింది. నిందితుడిగా చూపనందున అరెస్టు చేయబోమని సిఐడి కోర్టుకు తెలిపింది.
ఈ కేసులో నిందితులైతే 41-ఏ కింద నోటీసులు జారీ చేస్తామని సిఐడి అధికారులు కోర్టుకు తెలిపారు. హైకోర్టు తీర్పుతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ప్రభుత్వంపై కక్ష సాధింపు, అక్రమ కేసులు బనాయించవచ్చు కానీ.. కోర్టుల్లోనే న్యాయం జరుగుతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు షాక్ తప్పదని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి.
- Advertisement -