మన తెలంగాణ/సిటీ బ్యూరో: క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండాఆరోగ్యపరంగా ఎంతో మేలు కల్గుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మారేడేపల్లిలోని మైదానంలో జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడాలు కూడా చాల ముఖ్యమన్నారు. 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల చిన్నారులకు జిహెచ్‌ఎంసి పరిధిలోని 6 జోన్లలో 854 సమ్మర్ కోచింగ్ క్యాంప్‌లను ద్వారా వివిధ క్రీడాల్లో శిక్షణ ఇస్తున్నారన్నారు.
ఇందులో భాగగా అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటెన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, కరాటే, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిప్టింగ్ తదితర 44 రకాల క్రీడల్లో శిక్షణ ఈ నెల31 వరకు ఉంటుందని, ఈ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు శిక్షణ సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ది కోసం అనేక చర్యలు తీసుకోవడందో పాటు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తోందన్నారు.
జిహెచ్‌ఎంసి పరిధిలో కోట్లాది రూపాయాలతో స్పోర్ట్ కాంప్లెక్స్‌ల నిర్మాణం, క్రీడా మైదానాల అభివృద్ది పనులు చేపట్టిన విషయం అందరికి తెలిసేందే అన్నారు. తెలంగాణ నుంచి అనేక మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో తమ ప్రతిభను చాటి ఎంతో గుర్తింపును తీసుకువచ్చారని పేర్కొన్నారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో ప్రతిభను చాటే విధఃగా కృషి చేయడం ద్వారా మీకు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలని మంత్రి ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, జిహెచ్‌ఎంసి జాయింట్ కమిషనర్ తిప్పర్తి యాదయ్య, కార్పొరేటర్ దీపిక, స్పోర్ట్ ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్ గౌద్ తదితరులు పాల్గొన్నారు.