Sunday, January 19, 2025

మతతత్వ, దోపిడీ పార్టీలను ఓడించాలి

- Advertisement -
- Advertisement -

జమిలి ఎన్నికలతో రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి
ఇండియా పేరు తొలగించడం సరికాదు:  డా.ఆర్.ఎస్. ప్రవీణ్‌ కుమార్

మన తెలంగాణ/ హైదరాబాద్: మతతత్వ విద్వేషాలతో దేశాన్ని నాశనం చేస్తున్న బిజెపిని వచ్చే ఎన్నికలలో ఓడించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గానికి చెందిన అంబటి నరేష్ యాదవ్‌పార్టీలో చేరిన సందర్భంగా పెద్దపల్లిలో గురువారం ఓ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాతూడు కేంద్రంలో బిజెపి మత విద్వేషాలను రెచ్చగొడుతూ దోపిడీ పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు.

దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి కోల్పోతాయన్నారు. అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం సాధించకుండా కేంద్రం ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడమంటే రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించడమేనన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. భారత రాజ్యాంగంలో భారత్, ఇండియా అనే పేర్లు ఉన్నాయన్న ఆయన… కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును తొలగించడం సరికాదన్నారు. ఇండియా పేరుతో విపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడినందుకే తొలగించారా? అని ప్రశ్నించారు. రాజ్యసభలో రిజర్వేషన్లు లేకపోవడంతో అగ్రకులస్థులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రోద్బలంతోనే సూర్యాపేటలో బిసి నేత ఒట్టే జానయ్యపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది నాయకులు భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణకు పాల్పడుతున్నారని విమర్శించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పద్మశాలీలను మోకాళ్లపై నడిపిస్తానని అహంకారపూరితంగా చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వేలకోట్ల కాంట్రాక్టులన్నీ ఆధిపత్య వర్గాలకే దక్కుతున్నాయన్నారు. కాంట్రాక్టు లెక్చర్లను పర్మినెంట్ చేసినట్లే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు, ఏఎన్‌ఎంలు,విఏవోలను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News