Sunday, December 22, 2024

లౌకిక రాజ్యంలో మత విద్వేషాలా?

- Advertisement -
- Advertisement -

Religious hatred in a secular state?:Supreme court

21వ శతాబ్దంలో మతం పేరిట దిగజారడమేంటి? విద్వేష ప్రసంగాలతో ఎటుపోతున్నాం
కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి స్పందించకపోతే కోర్టు ధిక్కార చర్యలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు హెచ్చరిక

న్యూఢిల్లీ: మత దేశంలో విద్వేష ప్రసంగా లా? ప్రచారాలా? ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం అని సుప్రీంకోర్టు శుక్రవారం వ్యాఖ్యానించింది. దేశంలో మతపరమైన విద్వేషపు మాట ల తీరుపై ఘాటుగా స్పందించింది. విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోండి లేదా కోర్టు ధిక్కార చ ర్యల ఫలితం అనుభవించాల్సి ఉంటుందని ప్రభుత్వాలను హెచ్చరించింది. మత ప్రసంగాల కు పాల్పడేవారి పట్ల అధికారులు కఠినంగా వ్యవహరించాలని, వారిని ధిక్కార అభియోగాలతో శి క్షించాలని, ఈ మేరకు న్యాయస్థానం చొరవ తీసుకోవాలని దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఇది 21వ శ తాబ్దం, ఇప్పుడు మతం పేరి ట ఏ దశకు చేరుకుంటున్నాం, మనది మతసమానత్వపు లేదా తటస్థపు వైఖరి పాటించాల్సి న దేశం, అయితే జరుగుతున్నదేమిటీ’ అని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది, మతపరంగా తటస్థంగా వ్యవహరించా ల్సి ఉంది. అయితే ఈ రివాజును పాటిస్తున్నామా’ అని ప్రశ్నించింది. తటస్థత కు భిన్నంగా వేరు విధంగా జరగడం బాధాకరం అని తెలిపింది.

భారత్‌లోని ముస్లిం వర్గాలను ఎం చుకుని దాడులు జరుగుతున్నాయని, వారిని భయభ్రాంతులు చేస్తున్నారని అ త్యవసరంగా జోక్యం చేసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై గురువారం సుప్రీంకో ర్టు కేంద్రానికి, రాష్రాలకు నోటీసులు వెలువరించిం ది. తమ వివర ణ ఇచ్చుకోవాలని ఆదేశించింది. మ రుసటి రోజు ఈ మత విద్వేష ప్రసంగాల వ్యాజ్యం సుప్రీం ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా విద్వేష పూరిత నేరాలు, రెచ్చగొట్టే ప్రసంగాలపై స్వతంత్ర, నిష్పక్షపాత, విశ్వసనీయ దర్యాప్తు దిశలో కేంద్రం రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించాలని షహీన్ అబ్దుల్లా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తమ వాదనను విన్పించారు. ఈ సందర్భంగా న్యాయవాది ఇటీవల హిందూమహాసభలో ఓ ప్రసంగ పాఠాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సభలో వెస్ట్‌ఢిల్లీ బిజెపి ఎంపి పర్వీష్ వర్మ చేసిన ప్రసంగం చాలా అనుచితంగా ఉందని తెలిపారు. ముస్లింలను ఉద్ధేశించి ఈ ఎంపి వారిని పూర్తిగా సామాజికంగా బహిష్కరించాలి, ఇటువంటి వారిని తరిమికొట్టాలనే వ్యాఖ్యలకు దిగిన విషయాన్ని న్యాయవాది ప్రస్తావించారు. రెచ్చగొట్టే ప్రసంగాలపై సొంతంగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పోలీసు విభాగం స్పందించి వెంటనే కేసులు పెట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల కపిల్ సిబల్ ధన్యవాదాలు తెలిపారు. దీనిపై న్యాయమూర్తులు స్పందిస్తూ ఇది తమ బాధ్యత అని, ఇది చేయకపోతే తమ వైపు నుంచి విధి నిర్వహణ లోపం అవుతుందని తెలిపారు. ఓ వర్గంపై దాడులు, విద్వేష ప్రచారాలకు సంబంధించి అత్యంత కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) నిబంధనలను అమలు చేయాలని పిటిషనర్ సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News