Sunday, November 17, 2024

సూర్యాపేటలో రెమ్‌డెసివియర్ బ్లాక్ దందా.. ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Remdesivir black market gang arrested in Suryapet

 

సూర్యాపేట : రెమిడెసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని డిఎస్పీ మోహన్‌కుమార్ తెలిపారు. సోమవారం సూర్యపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కొవిడ్ 19 చికిత్స, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌కు ఉపయోగించే రెమిడెసీవర్ ఇంజెక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారనే పక్కా సమచారం మేరకు సిఐ ఆంజనేయులు పర్యవేక్షణలో ఎస్సైలు నరేందర్‌రెడ్డి, పి.శ్రీనివాస్, సిసిఎస్, క్రైం స్టాఫ్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. రెండు హాస్పిటల్స్ వద్దకు వెళ్లి హాస్పిటల్ మేనేజర్, అతనితో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులను అదుపు తీసుకొని విచారించినట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి వాటిని డిమాండ్‌ను బట్టి కావాల్సిన వారికి రూ.30 వేల నుంచి రూ. 35 వేలకు అమ్ముతూ ఆపదలో ఉన్న ప్రజలను మోసం చేసి అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నట్లు తెలిపారు.

మాధవరెడ్డి ఇచ్చిన సమాచారంపై సూర్యాపేట శివారులో 7 స్టార్ హోటల్ దగ్గరకు వెళ్లి అక్కడ మనోహర్, సైదా బాబు, మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి మొత్తం 21 రెమిడెసీవర్ ఇంజెక్షన్ల పంచులను డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ప్రైవేటు హాస్పిటల్ వద్దకు వెళ్లి హాస్పిటల్ మేనేజర్‌ను, అతనితో ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 4 రెమిడెసీవర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 30 రెమిడెసీవర్ ఇంజక్షన్లు, 11 సెల్‌ఫోన్స్, బాలెనో కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

పట్టుబడిన వారి వివరాలు..
గుద్దేటి మాధవరెడ్డి ఆత్మకూర్ (ఎస్), పందిరి కార్తీక్‌రెడ్డి ఆత్మకూర్ (ఎస్), గోపాలదాస్ పవన్ కళ్యాణ్(భక్తళాపురం), వల్లపు నరేష్(మద్దిరాల), జల్లిసైదా బాబు(రత్నాపురం), విమలపంగు రమేష్(రత్నాపురం), సుగుణావత్ వినోద్‌కుమార్ నాయక్(ఎర్రగుండుపాలెం), మద్దిమడుగు రమేష్ (చెన్నమినేనిపల్లి), పాంగోతు రంగా(పలుగు తండా), మద్దెల నర్సింహారాజు(విద్యానగర్ సూర్యాపేట), నిమ్మనగోటి శ్రీను (మాచనపల్లి)ను అరెస్టు చేసినట్లు తెలిపారు. గోపాల్‌దాస్ సాయి(భక్తళాపురం) పరారీలో ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో సిఐ ఆంజనేయులు, ఎస్సై పి.శ్రీనివాస్, ఎస్సై నరేందర్‌రెడ్డి, సిబ్బంది అంజయ్య, కృష్ణయ్య, సైదులు, కరుణాకర్, సిసిఎస్ సిబ్బంది నర్సింహారావు, రమేష్, దుర్గాప్రసాద్, గురుస్వాములు ఉన్నారు.

Remdesivir black market gang arrested in Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News