కేంద్రం సూచన మేరకు ధర తగ్గించిన ఫార్మా కంపెనీలు
డా.రెడ్డీస్ రెడిక్స్ రూ. 2,700
కొవిఫర్ రూ.3,490
సిప్లా సిప్రిమి రూ.3000
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ జోక్యంతో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల ధరలను ఔషధ కంపెనీలు తగ్గించాయని జాతీయ ఔషధాల ధరల సాధికారిక సంస్థ (ఎన్‌పిపిఎ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. క్యాడిలా హెల్త్‌కేర్ తమ బ్రాండ్ రెమ్‌డ్యాక్(రెమ్‌డెసివిర్ 100 ఎంజి) ఇంజెక్షన్ ధరను రూ.2800 నుంచి రూ.899కి తగ్గించింది. సింజెనే ఇంటర్నేషనల్ తమ బ్రాండ్ రెమ్‌విన్ ధరను రూ.3950 నుంచి రూ.2450కి తగ్గించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ తమ బ్రాండ్ రెడిక్స్ ధరను రూ.5400 నుంచి రూ. 2700కు తగ్గించింది. సిప్లా తమ బ్రాండ్ సిప్రెమీ ధరను రూ.4000 నుంచి రూ. 3000కు తగ్గించింది. మైల్యాన్ తమ బ్రాండ్ ధరను రూ.4800 నుంచి రూ.3400కు తగ్గించింది. జుబిలేంట్ జెనెరిక్స్ తమ బ్రాండ్ ధరను రూ.4700నుంచి రూ.3400కు తగ్గించింది. హెటిరో హెల్త్‌కేర్ తమ బ్రాండ్ కొవిఫర్‌ను రూ.5400 నుంచి రూ.3490కి తగ్గించింది. కొవిడ్19 చికిత్సలో తీవ్రత ఉన్న పేషెంట్లకు ఈ ఇంజెక్షన్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. రెమ్‌డెసివిర్ ధరలు తగ్గించినందుకు ఔషధ సంస్థలకు కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ సహాయమంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవ్య కృతజ్ఞతలు తెలిపారు.