- Advertisement -
గంగారామ్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ రాణా అభిప్రాయం
న్యూఢిల్లీ :కరోనా వైద్య చికిత్స ప్రొటోకాల్ నుంచి రెమ్‌డెసివిర్ ను కూడా త్వరలో తొలగించవచ్చని తాను భావిస్తున్నట్టు ఢిల్లీ లోని గంగారామ్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ డిఎస్ రాణా తెలిపారు. కరోనా చికిత్సలో బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే దీనికి కారణమని ఆయన తెలిపారు. ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్) ప్లాస్మా చికిత్సను కొవిడ్ ప్రొటోకాల్ నుంచి తొలగించింది. అదే విధంగా రెమ్‌డెసివిర్ ప్రభావం గురించి ఎలాంటి ఆధారాలు లేవని , అలాంటి మందులను వాడడం మానేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం మూడు మందులు మాత్రమే పనిచేస్తున్నాయని, వైద్యబృందం మరింత సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
- Advertisement -