Wednesday, January 22, 2025

ఇప్పుడు మునుగోడు అభివృద్ధి గుర్తుకు వచ్చిందా?: తలసాని

- Advertisement -
- Advertisement -

 

మునుగోడు:  ఫ్లోరైడ్ భూతం నుంచి శాశ్వత విముక్తి కల్పించిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించాలని కోరితే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చొరవతో ప్లోరిన్ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడిందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఒక వ్యక్తి స్వార్ధం కోసం వచ్చిందని దుయ్యబట్టారు.

ఎంఎల్ఎగా గెలిచిన 4 సంవత్సరాల తర్వాత నియోజకవర్గ అభివృద్ధి గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యతను మరిచి, కాంట్రాక్టుల పైనే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రద్ధ పెట్టారని దుయ్యబట్టారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న టిఆర్ఎస్ కు మద్దతు తెలపాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News