హాంకాంగ్: 68వ ఫ్లోర్ నుంచి కిందపడి సహస యాత్రికుడు రెమీ లుసిడి మృతి చెందిన సంఘటన హాంకాంగ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఫాన్స్ సహసికుడు రెమీ లుసిడి (30) అనే వ్యక్తి పెద్ద పెద్ద భవనాలు అధిరోహించడంలో నేర్పరి. ఎక్కడ భవనం కనిపిస్తే అది అధిరోహించిన తరువాతే అతడికి నిద్రపడుతుంది. హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్‌ను అధిరోహించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ కాంప్లెక్స్ సెక్యూరిటీకు 40వ ఫ్లోర్‌లో తన మిత్రుడు ఉన్నాడని కలువడానికి వెళ్తున్నానని అతడికి చెప్పాడు. 40వ ఫ్లోర్ మిత్రుడికి కాల్ చేసి అడిగితే అలాంటిదేమీ లేదని అతడు బదులిచ్చాడు.
Also Read: చివరి నిజాం మనుమడు కన్నుమూత
అప్పటికే ఎలివేటర్ ద్వారా లుసిడి పైకి చేరుకున్నాడు. 49వ ఫ్లోర్ నుంచి మెట్ల ద్వారా అతడు పైకి చేరుకున్నట్టు కాంప్లెక్స్ వాసులు తెలిపారు. ఉదయం 7.38 సమయంలో అతడిని పెంట్‌హౌస్‌లో పని చేసి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ది ట్రెగంటెర్ టవర్ నుంచి కిందకు దిగుతుండగా 68వ ఫ్లోర్(721 ఫీట్ల ఎత్తు) వద్ద పెంట్‌హౌస్ కిటికికి చిక్కుకుపోయాడు. 68వ ఫ్లోర్ వద్ద పట్టు తప్పిపోవడంతో పక్కనున్న కిటికీని కాలుతో బలవంతంగా తన్నాడు. అక్కడి నుంచి పట్టుతప్పి కిందపడిపోయాడు. అతడు బ్యాలెన్స్ కోసం కిటికీని అసరా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. కిటికీ అందకపోవడంతో కాలుతో తన్ని ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి కెమెరా సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.