Monday, December 23, 2024

కర్నాటకలో ముస్లింల 4 శాతం కోటా ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో బిజెపి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర స్థాయి రిజర్వేషన్ కోటాలో గణనీయ మార్పులు తీసుకువచ్చింది. ప్రత్యేకించి రాష్ట్రంలోని ముస్లింలకు ఇప్పటివరకూ ఉన్న 4 శాతం ఒబిసి కేటాయింపును ఎత్తివేసింది. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. రిజర్వేషన్ల కోటా పరిమితిని ఇప్పుడున్న 50 శాతం నుంచి 56 శాతానికి పెంచేందుకు తీసుకున్న నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిజర్వేషన్ల సంబంధిత నిర్ణయాలు తీసుకున్నారు. ముస్లింలకు ఉన్న 4 శాతం ఒబిసి కోటాను రద్దు చేయడం జరిగింది. వారిని 10 శాతం ఇడబ్లుఎస్ కేటగిరిలోకి చేర్చారు. ఇందులో ఉండే బ్రాహ్మణులు, వైశ్యులు, ముదలియార్లు, జైన్లు ఇతరులలోకి వీరిని చేర్చారు. సమావేశం తరువాత ముఖ్యమంత్రి బస్వరాజ్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మతపరమైన మైనార్టీల కోటాకు కోత పెట్టినట్లు ప్రకటించారు. ఇప్పటివరకూ ముస్లింలకు ఉన్న 4 శాతం కోటాను తీసివేసి ఇప్పుడు ఈ స్థానంలో రెండు శాతం కోటాను వొక్కలింగలకు, రెండు శాతం లింగాయత్‌లకు ఇవ్వాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News