Sunday, January 19, 2025

శంభూ బారికేడ్లు తొలిగించండి.. హర్యానాకు హైకోర్టు ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

రైతుల ఆందోళన నేపథ్యంలో శంభూ సరిహద్దులలో నెలకొల్పిన బారికేడ్లను తొలిగించాలని పంజాబ్ హర్యానా హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వానికి బుధవారం ఆదేశాలు వెలువరించింది. అప్పట్లో పంజాబ్ రైతులు చలో ఢిల్లీ ఉద్యమంలో భాగంగా రాజధానికి తరలివెళ్లకుండా అంబాలా సమీపంలోని శంభూ వద్ద ముళ్లకంచెలు, ఇనుపరాడ్లతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 13 నుంచి రైతులు అక్కడనే మకాం వేసుకుని ఉన్నారు. ఈ క్రమంలో బారికేడ్లను వారం రోజులలో తొలిగించివేయాలని హైకోర్టు తెలిపింది.

బ్లాకేడ్ చెల్లనేరదని పేర్కొంటూ పలు పిటిషన్లు రైతాంగ సమస్యల నేపథ్యంలో దాఖలు అయిన నేపథ్యంలో హైకోర్టు రూలింగ్ వెలువడింది. బ్లాకేడ్ తొలిగింపు తరువాతి పరిణామంలో తమ తదుపరి కార్యాచరణను ఖరారు చేసుకునేందుకు రైతు సంఘాలు ఈ నెల 16న సమావేశం కానున్నాయి. హైవేలపై ఎటువంటి అడ్డంకులు ఉండరాదనే ఆదేశాలు రావడంతో రైతు సంఘాల ఢిల్లీ ఆందోళన తిరిగి ఉధృతం అయ్యేందుకు వీలేర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News