Thursday, January 23, 2025

మేడిగడ్డపై త్వరలో నిర్ణయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నీటిపారుదలరంగంపై స మీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులతీరుపై ఆ గ్రహం వ్యక్తం చేశారు.మేడిగడ్డ బ్యారేజీ విషయంలో అధికారుల నాన్చుడు ధోరణి పట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేపోతోంది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మే డిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ నేపధ్యంలో గు రువారం మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరోమారు ఇదే అం శంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పధకంలో ఉన్న లోపాలను సరిదిద్ది ఈ పథకాన్ని రైతులకు ప్రయోజనకరంగా మార్చాలని ప్ర భుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూవస్తోంది. ప్రధానంగా గోదావరి నదిపై నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీకి చెం దిన పిల్లర్లు కుంగిపోవటంతో ఈ బ్యారేజీని ఏవిధంగా పునరుద్దరించాలన్నదానిపై నీటిపారుదల రంగం నిపుణులతో మేధోమధనం చేయిస్తోంది. ఇప్పటికే డ్యామ్‌సేఫ్టి కమిటీ ని పుణుల బృందం మేడిగ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజిలను అధ్యయనం చేసింది.

మధ్యంతర నివేదికను కూడ ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఈ నివేదికలో కీలక అంశాలపైనే ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. మేడిగడ్డ బ్యారేజీ గేట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవాటిని ఏ ర్పాటు చేసినప్పటికీ బ్యారేజీ భద్రతపై భరోసా లేదని నిపుణుల కమిటీ తెల్చిచెప్పింది. ఇదే అంశంపైన ప్రభుత్వం కూ డా ఏ విధంగా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేపోతోంది. గత వారం రోజులుగా మేడిగడ్డ బ్యారేజికి సంబంధించి కుంగిపోయన గేట్లను తొలగించే పనులు జరుగుతున్నాయి. బ్యారేజికి ఇరువైపుల వరదకు కొట్టుకు పోయిన సిమెంట్ దిమ్మెలు ఇతర వాటిని తొలగిస్తున్నారు. మరో వైపు ఏళ్లతరబడి కీలకస్థానాల్లో పాతుకుపోయిన కొందరు అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తప్పిదాలు , లోపాలు బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారన్న అభిప్రాయాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజిని నిర్మించిన కాంటాక్టు సంస్థ కూడా మాటామర్చేసింది.

బ్మారేజి నిర్మాణంతోపాటు నిర్వహణలో కూడా అగ్రిమెంట్ పూర్తయ్యేంతవరకూ తమదే బాధ్యత అని తొలుత ఎల్‌అండ్‌టి ప్రకటించింది. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారటంతో అగ్రిమెంట్‌లోని ఒప్పందాలు నీటిపైరాతులుగా మారాయన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిర్మాణ కంపెనీపైన ఏవిధమైన చర్యలు తీసుకోవాలన్నదానిపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గురువారం నాటి సమావేశంలో అధికారులతో చర్చించినట్టు తెలిసింది. అంతే కాకుండా కొందరు అధికారులపై ఏవిధమైన చర్యలు తీసుకోవాలన్నది కూడా చర్చకు వచ్చింది. అధికారులతో జరిగిన సమావేశంలో ఉన్నత స్థాయిలో పనిచేసి ఆ స్థానాలనుంచి ఇటీవలే వైదొలగిన ఇద్దరు విశ్రాంత అధికారులపైన కూడా మంత్రి చర్చించినట్టు సమాచారం . త్వరలోనే మేడిగడ్డ అశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించనుంది. వర్షాకాలం వచ్చేలోపే మేడిగడ్డ బ్యారేజి పునరుద్దరణ అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News