పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కలెక్టరేట్ సమీపంలో ప్రభుత్వ భూమిలో వెలసిన గుడిసెలను అధికారులు మంగళవారం ఉదయం కూల్చివేశారు. 255/1 సర్వే నంబరులోని ప్రభుత్వ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చివేస్తుండగా అక్కడి వారు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో అధికారులకు గుడిసె వాసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో చాలా చోట్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని వాటిని పరిశీలించి స్వాధీనం చేసుకోకుండా చల్లా ఏళ్లుగా గుడిసెలు వేసుకొని నివసిస్తున్న మాపై దౌర్జన్యం ఏంటని తక్షణమే మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు వెళ్లిపోవాలంటూ పెట్రోలు బాటిళ్లతో నిరసనకు దిగారు. ఇలా వారు గుడిసెలు వేసుకోవడం అధికారులు వాటిని కూల్చివేయడం గత కొన్నేళ్లుగా పరిపాటిగా జరుగుతున్న తంతే కావడం గమనార్హం.
ప్రభుత్వ భూముల్లో గుడిసెల తొలగింపు
- Advertisement -
- Advertisement -
- Advertisement -