Sunday, December 22, 2024

అక్రమ నిర్మాణాలు తొలగింపు

- Advertisement -
- Advertisement -

దుగ్గొండి: దుగ్గొండి లక్ష్మీపురం గ్రామంలోని పెద్దమ్మకుంట శిఖం భూమి సర్వే నంబరు 13.04 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో గత కొన్నేళ్ల క్రితం కొంత మంది పేదలు శాశ్వత నీడ పాటు ఏర్పాటుచేసుకున్నారు. గత మూడు నెలల క్రితం మరికొంత మంది నివాసాల కోసం రేకుల షెడ్లు నిర్మించుకున్నారు. ఇదే అదనంగా దళిత కుటుంబాలు వారం రోజుల క్రితం గుడిసెలు వేసుకున్నారు. ఇదే క్రమంలో యాదవ, ముదిరాజ్, రెడ్డి, ఆరె కులస్థులు సైతం పెద్దమ్మకుంట శిఖం భూమిలో నిర్మాణాల కోసం భూమిని ఆక్రమించుకుని ఫెన్సింగ్ చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు మంగళవారం ఉదయం జేసీబీ సాయంతో మూడు నెలల కాలం నుంచి నేటి వరకు వేసిన నిర్మాణాలను కూల్చివేత పనులు ప్రారంభించారు. ఇదే క్రమంలో సర్పంచ్ పాండవుల సురేంర్, ఎంపీటీసీ మామునూరి సుమన్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకున్నారు. దీంతో ఎంపీటీసీ మామునూరి సుమన్ తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News