Thursday, January 23, 2025

ఇంటర్ వెయిటేజీ తొలగింపు

- Advertisement -
- Advertisement -

మన కు ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ను ఎత్తివేశారు. ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇక ఎంసెట్‌లో పొం దే మార్కుల ఆధారంగానే ర్యాంకు కేటాయిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యద ర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 202324 విద్యాసంవత్స రం నుంచి ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఇంటర్మీడియేట్‌లోని సబ్జెక్టుల్లో పొందే మొ త్తం మార్కుల్లో 25శాతం ఎంసెట్‌కు వెయిటేజ్‌గా ఇస్తున్నారు. కొవిడ్ కారణంగా 20 20, 2021, 2022లో ఎంసెట్‌లో ఇంట ర్ వెయిటేజీని తొలగించి.. ఎంసెట్‌లో వి ద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయించారు. కొవిడ్ పరిస్థితులతో పూర్తిస్థాయిలో క్లాసులు జరగకపోవడం, ఇంటర్మీడియేట్‌లో అందరినీ కనీస మార్కులతో పాస్ చేయడం వంటి కారణాలతో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్ర భుత్వం రద్దు చేసింది. అయితే జెఇఇ, నీట్ వంటి జాతీయ పోటీ పరీక్షల్లోనూ ఇంటర్ మార్కుల వెయిటేజ్ లేకపోవడం వంటి కా రణాలతో ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుం ది.

నగరాల్లోనిప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఇంటర్ మార్కులు ఎక్కువ రావడం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు అనేక కారణాల వల్ల తక్కువ మార్కులు పొందడంతో ఎంసెట్ ర్యాంకుల్లో గ్రామీణ విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉంటోంది. ఎంసెట్‌కు రాష్ట్ర ఇంటర్ బోర్డుతో పాటు సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ, ఒపెన్ స్కూల్, ఎపి ఇంటర్ విద్యార్థులు కూడా హాజరవుతారు. అందులో కొన్ని బోర్డులు మార్కులు కేటాయిస్తే, మరికొన్ని బోర్డులు గ్రేడ్‌లు కేటాయిస్తున్నాయి. ఒకవేళ గ్రేడ్‌లు కేటాయిస్తే వాటిని మార్కుల్లోకి మార్పు చేసి ఎంసెట్‌లో వెయిటేజీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎంసెట్ ఫలితాల సమయం నాటికి ఇతర బోర్డుల ఫలితాలు వెలువడకపోతే ఆ విద్యార్థులకు తర్వాత ర్యాంకులు కేటాయిస్తారు. ఈ కారణాలతో కొన్ని సందర్భాలలో ఫలితాలు కూడా ఆలస్యమవుతుంటాయి. గత మూడేళ్లుగా ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ లేకపోవడంతో ఫలితాలు సకాలంలోగా సజావుగా వెలువడుతున్నాయి. ఈ విషయాలన్నింటినీ సమీక్షించిన విద్యాశాఖ ఇంటర్ మార్కుల వెయిటేజ్‌ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News