Thursday, January 23, 2025

డిప్యూటీ మేయర్ కుర్ర శివ చొరవతో రోడ్డు కబ్జా తొలగింపు

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని 1౩ వ డివిజన్ పరిధిలోని కమలానగర్ సర్వే నంబర్ 40లో రోడ్డును కబ్జా చేసి దాని చట్టు ప్రహారీగోడను నిర్మించి ఆక్రమణకు పాల్పడుతున్న విషయాన్ని కాలనీ వాసులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు..అధికారులు స్పందించకపోవడంతో డిప్యూటీ మేయర్ సంబంధిత అధికారులను నిలదీయడంతో మంగళవారం నాడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రహారీగోడను కూల్చారు..
కబ్జా చేస్తే ఎవరిని విడిచి పెట్టేది లేదు : డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని కార్పొరేషన్లకు పీర్జాదిగూడ కార్పొరేషన్ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఎవరైన సరే పార్కులు గాని రోడ్లు కబ్జా చేయాలని చూస్తే సహించేంది లేదని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

కమలానగర్ కాలనీలో రోడ్డు సమస్య కాలనీ మా దృష్టికి తీసుకువచ్చారని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు స్థలంలో ని ర్మించిన ప్రహరీ గోడను అధికారులు కూల్చారని అన్నారు. ప్రజలు, మా పాలక వర్గం, మంత్రి మల్లారెడ్డి సహకారంతో కార్పొరేషన్‌ను ఇంకా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకేళ్తామని అన్నారు. రోడ్డు స్థలాన్ని కాపాడేందుకు సహకరించిన డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్‌ను కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News