Sunday, January 19, 2025

రేవంత్ రెడ్డి ఫిర్యాదు.. మల్లారెడ్డి వేసిన రోడ్డు తొలగింపు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో దాదాపు 2500 గజాల స్థలాన్ని మల్లారెడ్డి అక్రమంగా ఆక్రమించి రోడ్డును నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మాజీ మంత్రి కళాశాలకు రోడ్డు నిర్మించారని, దీనిపై గతంలోనే రేవంత్‌రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇటీవల ప్రభుత్వం మారడంతో సమస్య మళ్లీ తెరపైకి రావడంతో శనివారం మేడ్చల్ కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని మల్లారెడ్డి రోడ్డును తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News