Thursday, January 23, 2025

మసీదుల పైన లౌడ్‌స్పీకర్లను మీ రాష్ట్రాలలో తొలగించండి

- Advertisement -
- Advertisement -

Remove loudspeakers on mosques in your states

బిజెపికి ప్రవీణ్ తొగాడియా సూచన

నాగపూర్: తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మసీదులపైన లౌడ్‌స్పీకర్లను బిజెపి తొలగించాలని విశ్వహిందూ పరిషద్(విహెచ్‌పి) మాజీ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా సూచించారు. మసీదులపైన ఉండే లౌడ్ స్పీకర్లను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించాలంటూ ఎంఎన్‌ఎన్ అధ్యక్షుడు రాజ్ థాకరే ఇటీవల చేసిన డిమాండుపై తొగాడియా స్పందిస్తూ బిజెపి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నపుడు అటువంటి చర్య ఏదీ తీసుకోలేదని గుర్తు చేశారు. మహారాష్ట్రలో డిమాండు చేసేముందు బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముందుగా మసీదులపైనుంచి లౌడ్ స్పీకర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆ పని మధ్యప్రదేశ్, గుజరాత్‌లో జరగాలని మంగళవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ తొగాడియా సూచించారు. లౌడ్ స్పీకర్లపై సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని ఆయన డిమాండు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News