- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ల నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించాలని కేంద్ర ఆరోగ్యశాఖను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వెంటనే తొలగించాలని తెలిపింది. ఎన్నికల వేళ మోడీ ఫోటో ఉండటం నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ఇసికి ఫిర్యాదు చేసింది. దీంతో సర్టిఫికెట్ల నుండి ప్రధాని ఫోటోను తొలగించాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు మార్చి 27 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బెంగాల్ లో సహా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలు నువ్వనేనా అన్నట్టు ప్రచారంలో పాల్గొంటున్నాయి.
- Advertisement -