- Advertisement -
సోమవారం ఓ మహిళ కడుపులో నుంచి ఏడు కిలోల కణితిని ఆపరేషన్ చేసి తొలగించారు. మహ్మద్‌నగర్ మండలం గున్కుల్ గ్రామానికి చెందిన అబేదాబేగం 6 నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఎల్లారెడ్డి పట్టణంలోని సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి జనవరి 25వ తేదినాడు వైద్యానికి వచ్చింది. ఆమెకు స్కానింగ్ చేసి చూడగా కడుపులో అండాషయ కణతి ఉందని గుర్తించారు. సోమవారం ఉదయం ఆమెకు ఆపరేషన్ చేసి 7.750 కిలోల గర్భసంచి కణితిలను తొలగించడం జరిగింది. ఆపరేషన్ తరువాత పేషెంట్ పరిస్థితి మాములుగా మారినట్లు ఆసుపత్రి డాక్టర్ రవీంద్రమోహన్ తెలిపారు.
- Advertisement -