Friday, December 27, 2024

ఢిల్లీకి ‘ఇంద్రప్రస్థ’గా పేరు మార్చండి: స్వామి చక్రపాణి

- Advertisement -
- Advertisement -

Swami Chakrapani Maharaj
న్యూఢిల్లీ: 40 ప్రదేశాలకు పునఃనామకరణం చేయాలని బిజెపి ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా,  ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాసిన ఒక రోజు తర్వాత అఖిల భారత్ హిందూ మహాసభ, సంత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ దేశరాజధానికి ‘ఇంద్రప్రస్థ’ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. తమ ఆర్గనైజేషన్ ఈ విషయంలో సంతకాల ఉద్యమాన్ని చేపట్టగలదన్నారు. ‘ఢిల్లీ అనేది కొత్త పేరు, కానీ మహాభారతం కాలం నుంచే దానికి ఇంద్రప్రస్థ’ అన్న పేరుంది’ అని చక్రపాణి తెలిపారు. ‘తోమర్ కాలంలో ఓ రాజు ఓ ఇనుప కడ్డీని నాటారు. అది వదులుగా(డీలిగా) ఉండింది. దాంతో తర్వాత ఆ ప్రాంతానికి ‘ఢిల్లీ’ అన్న పేరు స్థిరపడింది’ అని దాని పూర్వోత్తర కథనాన్ని ఆయన తెలిపారు. ‘ఇంద్రప్రస్థ అంటే ప్రభువు ఇంద్రుడి రాజ్యం, అక్కడ అందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు అని అర్థం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రతిస్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News