అహ్మదాబాద్ : గుజరాత్ జామ్‌నగర్‌కు చెందిన ప్రముఖ వైద్యులు గౌరవ్ గాంధీ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కార్డియాలిజిస్టు గాంధీగా పేరొందని ఈ డాక్టర్ తన వైద్య వృత్తిలో ఇప్పటివరకూ 16000కు పైగా గుండె ఆపరేషన్లు నిర్వహించి రికార్డు స్థాపించారు. కాగా మంగళవారం రాత్రి నిద్రలో ఉన్నప్పుడు గుండెపోటు వచ్చిన ఈ డాక్టరు అచేతన స్థితిలోకి వెళ్లాడు. తరువాత చనిపోయ్యారు.
సోమవారం, మంగళవారం కూడా ఆయన తన వద్దకు వచ్చిన రోగులను ఆయన పరీక్షించి తగు చికిత్స నిర్వహించి పంపించారు. కానీ రాత్రిఆయన గుండెపోటుకు గురి కావడం విషాదాన్ని నింపింది. ప్యాలెస్ రోడ్‌లోని ఆయన నివాసంలో రాత్రి డిన్నర్ తరువాత ఎటువంటి అలసల లేకుండానే నిద్రలోకి జారుకున్నారు. అయితే తెల్లవారుజామున ఆరుగంటలకు కుటుంబ సభ్యులు ఆయనను నిద్రలేపడానికి వెళ్లగా ఆయన చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. 16వేల గుండె ఆపరేషన్ల ఘనత ఉన్న ఈ డాక్టర్ గుండెపోటుతో చనిపోవడం జామ్‌నగర్ ఇతర ప్రాంతాలలో కలకలానికి దారితీసింది.