మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ కొరియోగ్రాఫర్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక నెల్లూరులోని క్లబ్ హోటల్ లో డ్యాన్స్ మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోలో తాను ఆర్థిక ఇబ్బం దులు, పెరిగిపోయిన అప్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఢీ షోలో డ్యాన్స్ మాస్టర్ గా ఉన్న చైతన్య కొరియో గ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నందుకు తన తల్లిదండ్రులకు, తోటి డ్యాన్స్ మాస్టర్లకు చైతన్య సారీ చెప్పాడు.
అప్పులు తీర్చ గల సామర్థ్యం ఉన్నప్పటికీ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు అందులో పేర్కొన్నాడు. అప్పు తీర్చేందుకు మరో అప్పు చేయడం. ఇలా అప్పు మీద అప్పు తనకు ఇబ్బందిని కలిగించినట్లు చెప్పాడు. తనకు పేరు తెచ్చిన డ్యాన్స్ షోలకు రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.