Thursday, January 23, 2025

5వ తేదీ నుంచి అద్దె బస్సు యజమానుల సమ్మె

- Advertisement -
- Advertisement -

ఆర్టీసికి అల్టిమేటం జారీ చేసిన యజమానులు

మనతెలంగాణ/హైదరాబాద్:  టిఎస్ ఆర్టీసిలో సమ్మె సైరన్ మోగనుంది. ఉచిత బస్సు ప్రయాణంతో అద్దె బస్సులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆగ్రహంతో ఉన్న అద్దె బస్సు యజమానులు ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. రద్దీ కారణంగా బస్సులు దెబ్బతింటున్నాయని, ప్రమాదాలు సైతం జరిగే అవకాశం ఉందని అద్దె బస్సుల యజమానులు వాపోతున్నారు.

దీంతో ఈ నెల 5వ తేదీ నుంచి సమ్మెలోకి దిగుతామని ఆర్టీసి సంస్థను హెచ్చరించారు. అద్దె బస్సు యజమానుల నిర్ణయంతో మహిళలకు ఉచిత బస్సు జర్నీ విషయంలో ఆర్టీసి యాజమాన్యం, ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News