Thursday, March 20, 2025

ఆక్వా మెరైన్ పార్కుపై రేణూదేశాయ్ హైకోర్టులో పిల్

- Advertisement -
- Advertisement -

ఆక్వా మెరైన్ పార్కుకు అనుమతులు రద్దు చేయాలంటూ సినీ నటులు రేణూ దేశాయ్, శ్రీవిద్య హైకోర్టులో
ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ప్రభుత్వం శంషాబాద్ లోని కొత్వాల్ గూడ పరిధిలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఆక్వా మెరైన్ పార్కును నిర్మిస్తోంది. దేశంలోనే అతిపెద్ద ఆక్వా మెరైన్ పార్కును రూ.300 కోట్ల భారీ నిధులతో నిర్మిస్తున్నారు. అయితే సముద్రం లేకుండా ఆక్వా మెరైన్ పార్కును నిర్మించడం సాధ్యం కాదంటూ తక్షణమే దానిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని రేణూ దేశాయ్, శ్రీవిద్య కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆక్వా మెరైన్ లో అనేక సముద్ర జీవులతోపాటు, అరుదైన జీవులను కూడా పెంచాల్సి ఉంటుందన్నారు. సముద్రంలేని చోట కృత్రిమ నీటిలో వీటిని పెంచాల్సి ఉంటుందని, అరుదైన జాతులు కృత్రిమ నీటిలో జీవించలేవని పేర్కొన్నారు.ఆక్వా మెరైన్ పార్కు ఏర్పాటుకు ముందు సముద్ర జీవులు, వాటి సహజ అలవాట్లపై కనీసం అధ్యయనం కూడా చేయలేదని కోర్టుకు వివరించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హెచ్‌ఎండిఎ, రాష్ట్ర మత్స్యశాఖను ప్రతివాదులుగా పిటిషన్‌లో చేర్చారు.

ఇప్పటికే హెచ్‌ఎండిఎ దీనిపై కౌంటర్ దాఖలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ కౌంటరు దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరారు. కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను హైకోర్టు మరో 4 వారాలకు వాయిదా వేసింది. అయితే భారతదేశంలోనే అతి పెద్దదిగా పేర్కొంటున్న ఆక్వా మెరైన్ పార్కు కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌లోనే 4.27 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు గత ప్రభుత్వం 2023లో టెండర్లు పిలిచింది. పార్కు నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ పార్కులో ప్రత్యేక సొరంగం మార్గం 100 మీటర్ల వ్యాసంతో 3.5 మీటర్ల వెడల్పుతో నడిచేందుకు వీలుగా ఉండబోతుంది. సొరంగాన్ని 180 డిగ్రీలలో చూడవచ్చు. సొరంగంలో కనీసం 2,500 మంది ఒకేసారి వీక్షించేటట్లుగా దీని సామర్థ్యం ఉంటుంది. మొత్తం అక్వేరియంను నీటితో నింపాలంటే మూడు మిలియన్ లీటర్ల సముద్ర నీరు అవసరమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News