Tuesday, January 21, 2025

సామాజిక కార్యకర్త హేమలత లవణంగా…

- Advertisement -
- Advertisement -

Renu Desai Onboard for 'Tiger Nageswara Rao'

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ 1970లో స్టువర్ట్‌పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమలత లవణం అనే చాలా ముఖ్యమైన, పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తోంది. ఇది నిజ జీవిత పాత్ర. హేమలత లవణం భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత. అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. జివి ప్రకాష్ కుమార్ బిజిఎమ్ పాత్రను మరింత ఎలివేట్ చేసింది. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Renu Desai Onboard for ‘Tiger Nageswara Rao’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News