Monday, April 14, 2025

అందుకే.. రెండో పెళ్లి చేసుకోలేదు: రేణు దేశాయ్

- Advertisement -
- Advertisement -

ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఏమైందో తెలియదు కానీ.. ఆ పెళ్లి ఆగిపోయింది. తాజాగా ఆ పెళ్లి ఆగిపోవడం గురించి ఆమె ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘నేను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాను. ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నా. కానీ అటు ఆ రిలేషన్‌షిప్‌కి, ఇటు పిల్లలకి న్యాయం చేయలేనని గ్రహించా. నా కూతురు ఆద్యకు ప్రస్తుతం 15ఏళ్లు. బహుశా ఆమెకు 18 ఏళ్లు వచ్చాక పెళ్లి గురించి ఆలోచిస్తానేమో’ అని చెప్పారు.

కాగా, పవన్-రేణు దేశాయ్ లకు అకీరానందన్, ఆద్య జన్మించిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత పవన్.. రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పవన్ కు మరో పాప, బాబు పుట్టారు. రేణు దేశాయ్ కూడా మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నా.. తన పిల్లల కోసమే మళ్లీ పెళ్లి చేసుకోలేదని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News