Sunday, December 22, 2024

ఉపాసన సాయం.. థ్యాంక్స్ చెప్పిన రేణూ దేశాయ్‌

- Advertisement -
- Advertisement -

నటి రేణూ దేశాయ్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సాయం చేశారు. ఇటీవల రేణూ దేశాయ్ ‘శ్రీ ఆద్య యానిమల్ షెల్టర్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సందర్భంగా ఎన్నో ఏళ్ల తన కల నెరవేరిందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ పోస్టో పెట్టిన సంగతి తెలిసిందే.

కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలను ఈ సంస్థ కాపాడుతుంది. అందుకు విరాళాలు ఇవ్వాలని ఆమె కోరగా.. స్పందించిన ఉపాసన తన పెంపుడు శునకం రైమీ పేరిట విరాళం అందించారు. దీంతో పెట్స్ రెస్క్యూ కోసం అంబులెన్స్ కొనుగోలుకు సాయం చేసినందుకు ‘థాంక్యూ రైమీ’ అంటూ రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News