Monday, January 20, 2025

వైఎస్ షర్మిలను టార్గెట్ చేసిన రేణుకా చౌదరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. రేణుకా చౌదరి వైఎస్ షర్మిలను టార్గెట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడుతూ షర్మిల ఎవరో తనకు తెలియదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలది ఆంధ్రా అని, వాళ్ల అన్న జగన్ కూడా అక్కడే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వాళ్లంతా ఖమ్మం జిల్లాలో ఎందుకున్నారని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఎవరూ ఎన్ని చేసిన ఖమ్మం నుంచి నన్ను పంపే మొనగాడు లేడని, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అడ్రస్ లేకుండా పోతారని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదని ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పునీతులవుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఎపి, తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా
తెలంగాణలో బిజెపి నామా రూపాలు లేకుండా పోతుందని ఆమె జోస్యం చెప్పారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయి అంటూ ఆమె చెప్పారు. దాదాపు 100 సీట్లు బిజెపికి తగ్గనున్నట్టు ఆమె తెలిపారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు గుడికి వెళ్లాలంటే పర్మిషన్ అవసరమా అని ఆమె ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఎటువంటి వర్గవిభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తాను ఎపి, తెలంగాణలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని రేణుకాచౌదరి తెలిపారు.
ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశా
ఖమ్మం జిల్లాను జలగం వెంగళరావు తరువాత అంత అభివృద్ధి చేసింది రేణుకాచౌదరి మాత్రమేనని ఆమె తెలిపారు. రేణుకాచౌదరి అంటే పొగరు, పౌరుషం అని ఆమె పేర్కొన్నారు. పాలేరులో షర్మిలకు అవకాశం ఇవ్వమని, పబ్లిక్ ఒపీనియన్ చెబితే తాను సంతోషంగా తప్పుకుంటానన్నారు షర్మిల పార్టీలోకి వచ్చే దాని గురించి తాను ఆలోచించడం లేదన్నారు. రాష్ట్రం మొత్తం వదిలేసి పాలేరులోనే షర్మిల ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపుతుందో తనకు అర్థం కావడం లేదన్నారు. పూర్వ జన్మ సుకృతం వల్ల ఖమ్మం జిల్లాకు వచ్చానని, తాను పొంగులేటికి వ్యతిరేకంగా లేనని రేణుకాచౌదరి తెలిపారు.

ఖమ్మం జిల్లా పాలేరుపై షర్మిల గురి
తెలంగాణలో వైఎస్సార్ టిపి పార్టీని ప్రారంభించిన షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాకుండా షర్మిల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించింది. శనివారం వైఎస్ జయంతి సందర్భంగా పాలేరులో ఆయన విగ్రహాం ఆవిష్కరించి తాను పాలేరు నుంచే బరిలోకి దిగుతానని మరోసారి షర్మిల స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ కంచుకోట అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్ అభిమానులు ఎక్కువగా ఉండటంతో షర్మిల పోటీకి ఆ జిల్లాను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను నిరంతరం కలిసేలా ఆమె ప్రణాళికలు రూపొందించారు. ఇలా, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల్లో షర్మిల జోక్యం చేసుకోవడంతోనే ఆమెను రేణుకా చౌదరి టార్గెట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News