Sunday, January 19, 2025

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారు ?:రేణుకా చౌదరి

- Advertisement -
- Advertisement -

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు? ఏ హక్కుతో గాంధీభవన్ కు వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని ఆమె నిలదీశారు. గాంధీ భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ తడాఖా ఏమిటో చూపిస్తామన్నారు. బిజెపి వాళ్లకు దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణని పట్టుకోవాలని ఆమె సవాల్ విసిరారు. నీరవ్ మోడీ, చాక్సీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయారని రేణుకా చౌదరి విమర్శించారు. ప్రజ్వల్ రేవణ్ణని బలపరిస్తే తనని బలపర్చినట్టే అని మోడీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు.

బిజెపి నాయకులు ఇంత చేస్తుంటే ఎన్నికల అధికారులు ఎందుకు సైలంట్‌గా ఉంటున్నారని ఆమె ప్రశ్నించారు. బ్రిజ్ భూషణ్ అన్ని అరాచకాలు చేసినా మళ్లీ ఆయన కుటుంబానికే ఎందుకు టికెట్ ఇచ్చారని రేణుకా చౌదరి మోడీని ప్రశ్నించారు. దేశంలో ఉన్న ముస్లింలకు మోడీ ప్రధాని కాదా? అని ఆమె ప్రశ్నించారు?. చైనా మన గడప తొక్కి ఇంట్లో ఉంటే మోడీ ఎందుకు మాట్లాడడం లేదన్నారు. చాలామంది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్‌కు వస్తున్నారంటూ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ పెద్ద ఛాతీ ఉండడం కాదు. దానిలో గుండె, మనసు కూడా ఉండాలని ఆమె సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News