Thursday, January 23, 2025

ఎస్ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఓవర్ యాక్షన్ చేశారు. రేణుకా చౌదరి ఎస్‌ఐ కాలర్ పట్టి లాగారు. పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ప్రస్టేషన్‌లో విచక్షణ కోల్పోయారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఇడి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరీ కొడతానంటూ రేణాకా చౌదరీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. రేణుకాచౌదరీ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా పోలీసులు సంయమనం పాటించారు. పోలీసులతో ఆమె తీవ్ర వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ నేతల వీరంగంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నానా అవస్థలు పడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ పైశిచికానందం పొందుతున్నారు. అల్లర్లు చేస్తూ ఉన్మాదంతో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. బైక్‌కు నిప్పు పెట్టడంతో పాటు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. కాంగ్రెస్ మూకలు మహిళా కండక్టర్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News